Tuesday, January 21, 2025

పది మందిని పొడిచి చంపి…

- Advertisement -
- Advertisement -

Stabbing 10 people dead in Canada

 

ఒట్టావా: ఇద్దరు వ్యక్తులు కత్తులతో వీరవిహారం చేసి పది మందిని పొడిచి చంపిన సంఘటన కెనడాలోని వెల్డన్ ప్రాంతం సాస్క్‌ట్చవన్‌లో జరిగింది. జేమ్స్ స్మిత్ క్రీ నేషన్‌లోని పలు ప్రాంతాలలో ఇద్దరు వ్యక్తులు 25 మందిని పొడిచారు. ఘటనా స్థలంలోనే పది మంది దుర్మరణం చెందగా 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితులు డామీన్ శాండర్సన్(31), మీల్స్ శాండర్సన్(30)గా గుర్తించారు. నల్లటి కురులు, గోదుమ రంగు కళ్లతో నిందితులు ఉంటారని పోటోలను పోలీసులు విడుదల చేశారు. నిందితులు ఘటనా స్థలం నుంచి నిస్సన్ రోగ్ ప్రాంతానికి పారిపోయినట్టు వెల్లడించారు. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రాడో భయానకంతో పాటు హృదయ విదారకరమైన ఘటనా అని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News