Monday, December 23, 2024

నోట్ల గుట్టలు..బంగారు కడ్డీలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/వైరా, కరీంనగర్ రూరల్ : అ సెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో, రాష్ట్ర వ్యా ప్తం గా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినట్లయింది. ఈ క్రమంలో తా యిలాలు, నగదు, మద్యం, డ్రగ్స్‌తో పాటు ఇతర ప్రలోభాలపై ఎన్నికల సంఘం నిఘా మొదలైంది. ప్రధానంగా నగదు, బం గారం ఇతర వస్తువుల తరలింపుపైనా ఆంక్షలు అమల్లో ఉం టాయి. ఈ క్రమంలో నగదు, మద్యం, బంగారం, డ్రగ్స్ కట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా 148 చెక్‌పోస్టులు ఏర్పాటయ్యాయి.

మరోవైపు అధికారులు, పోలీసులు సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలకు తెరలేపారు. ఖమ్మం జిల్లా వైరాలో పోలీసుల తనిఖీ లో పశ్చిమ గోదావరి జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ రాజేశ్వరి నుంచి రూ.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కారులో ఆ నగదు తరలిస్తుండగా, ఆ నగదుకు ఎలాంటి అనుమతి ప త్రాలు లేవని పోలీసులు గుర్తించారు. ఏలూరు నుంచి వ్యవసాయ భూమికి చెందిన డబ్బులు హైదరాబాద్ తీసుకెళుతున్నానంటూ రాజేశ్వరి పోలీసులకు తెలిపారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ పశ్చిమ గోదావరి నుంచి వచ్చిన ఓ కారులో రూ.5 లక్షలు లభ్యమయ్యాయని తెలిపారు. ఆ మహిళ సరైన పత్రాలు చూపించక పోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. స్వాధీనం చేసుకున్న రూ.5 లక్షలను ఐటి అధికారులకు అప్పగిస్తామని వెల్లడించారు.

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లాలంటే అనుమతులు తప్పనిసరి అని పోలీసులు స్పష్టం చేశారు. మరో వైపు తల్లాడలో రూ.5 లక్షల రూపాయల నగదును తల్లాడ పోలీసులు పట్టుకున్నారు. తల్లాడ ఎస్‌ఐ పి.సురేష్ ఆధ్వర్యంలో తల్లాడ రింగ్‌రోడ్ సెంటర్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ద్విచక్రవాహనంపై ఓ వ్యక్తి ఐదు లక్షలు తీసుకెళ్తుండగా పట్టుబడ్డాడు. ఈ నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లభించకపోవడంతో నగదును సీజ్ చేశా రు. కరీంనగర్‌లో పోలీసుల తనిఖీలో రూ.3 లక్షల నగదు సీజ్ చేశారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో పోలీసులు తనిఖీలో 16 కిలోల బంగారంతో పాటు 300 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. బంగారం, వెండి విలువ రూ. 10 కోట్లు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తుండగా పోలీసులు సీజ్ చేశారు. చందానగర్‌లో 6 కేజీల బంగారంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ వెస్ట్, సౌత్ జోన్‌లో రూ.25 లక్షల హవాలా నగదును పోలీసులు సీజ్ చేశారు. మరో వైపు హైద్రాబా ద్ గచ్చిబౌలి గోపన్‌పల్లిలో ఓటర్లకు పంచేందుకు సిద్దంగా ఉన్న కుక్కర్లను సీజ్ చేశారు పోలీసులు. కుక్కర్లపై కాంగ్రెస్ నేత రఘునాథ్ యాదవ్ స్టిక్కర్లను గుర్తించారు. హైద్రాబాద్ ఫిలింనగర్‌లో మద్యం సీసాలను సీజ్ చేశారు. రూ.30 లక్షల నగదు సీజ్ చేశారు. వ నస్థలిపురంలో వాహనాల తనిఖీల్లో రూ. 4 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తనిఖీలు చేస్తున్న సమయంలో రూ. 11.50 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. ఫరూక్ నగర్ మండలం రాయికల్ టోల్ ప్లాజా వద్ద బైక్‌పై వెళ్తున్న వ్యక్తి నుండి పోలీసులు నగదును సీజ్ చేశారు. షాద్ నగర్ కు చెందిన ఆశోక్ అనే వ్యక్తి నుండి ఈ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చాదర్‌ఘట్‌లో రూ.9.30 లక్షలు, గోషామహల్‌లో రూ.15 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. పురానాపూల్ గాంధీ విగ్రహం వద్ద వాహనాల తనిఖీలో రూ.15 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బుకు సరైన పత్రాలు లేకపోవడంతో నగదును సీజ్ చేశారు. సరైన పత్రాలు చూపితే నగదును అప్పగిస్తామని పోలీసులు ప్రకటించారు. మరోవైపు డ్రగ్స్‌పైనా పోలీసులు, అధికారులు దృష్టి సారించారు. గోవానుంచి నగరానికి 32 గ్రాముల కొకైన్‌ను తీసుకువచ్చి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Gold

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News