- Advertisement -
హైదరాబాద్: దావోస్ వేదికగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. రాష్ట్రంలో రూ. వెయ్యి కోట్ల పెట్టుబడుకు స్టాడ్లర్ రైల్ కంపెనీ ముందుకొచ్చింది. దీంతో తెలంగాణలో 2500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు తెలంగాణతో ఒప్పందం కుదుర్చుకుంది. దావోస్ లో రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ సమక్షంలో స్టాడ్లర్ రైల్ కంపెనీ అవగాహన ఒప్పందం జరిగింది. ‘స్టాడ్లర్ రైల్’ తమ రైల్ కోచ్ తయారీ యూనిట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం ఆనందంగా ఉందని మంత్రి కెటిఆర్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
- Advertisement -