Saturday, November 2, 2024

పోలియో చుక్కలకు బదులుగా శానిటైజర్…

- Advertisement -
- Advertisement -

Staff given hand sanitizer instead of polio drops

ముంబై: పోలియో చుక్కలకు బదులుగా హ్యాండ్ శానిటైజర్ చుక్కలు వేయడంతో 12 మంది పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా కప్పికోప్రి గ్రామంలో చోటుచేసుకుంది. సిబ్బంది నిర్లక్ష్యం పిల్లల ప్రాణాల మీదకు తెచ్చిందని చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీయో డ్రాప్స్ వేసిన కొద్దిసేపటికి పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని యవత్మాల్ జిల్లా పరిషత్ సిఇఒ శ్రీకృష్ణ పంచాల్ తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని, ముగ్గురు ఆరోగ్య కార్యకర్తలను సస్పెండ్ చేయనున్నట్టు సిఇఒ శ్రీకృష్ణ పంచాల్ వెల్లడించారు.

Staff given hand sanitizer instead of polio drops

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News