Wednesday, January 22, 2025

బిజెపి ఎంఎల్‌ఎ నివాసంలో సిబ్బంది ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

లక్నో: ప్రియురాలితో గొడవ నేపథ్యంలో బిజెపి ఎంఎల్‌ఎ నివాసంలోని సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నాడు.. వీడియో కాల్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో వారంతా ఆ ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. లక్నోలోని బక్షీ కా తలాబ్ నియోజక వర్గానికి చెందినబిజెపి ఎంఎల్‌ఎ యోగేష్ శుక్లా మీడియా సెల్‌లో 24 ఏళ్ల శ్రేష్టా తివారీ పని చేస్తున్నాడు. ఒక మహిళతో అతడికి నాలుగేళ్లుగా పరిచయం ఉంది. అయితే ప్రియురాలైన ఆ మహిళ, తివారీ మధ్య ఇటీవల గొడవ జరిగింది.

కాగా, ఆదివారం రాత్రి వేళ ఎంఎల్‌ఎ యోగేష్ శుక్లా అధికార నివాసం వద్ద తివారీ ఒంటరిగా ఉన్నాడు. సోమవారం తెల్లవారుజామున తన ప్రియురాలికి వీడియో కాల్ చేశాడు. ఆత్మహత్యకు పాల్పడి చనిపోతున్నట్లు చెప్పాడు. దీంతో ఆ మహిళ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. అలాగే తివారీ ఉన్న బిజెపి ఎంఎల్‌ఎ ఫ్లాట్ వద్దకు ఆమె వెళ్లింది. లాక్ చేసి ఉన్న డోర్ వద్ద వేచి ఉంది.మరోవైపు పోలీసులు కూడా ఎంఎల్‌ఎ నివాసానికి చేరుకున్నారు. లాక్ చేసి ఉన్న డోర్‌ను పగులగొట్టారు. లోపలకు వెళ్లి చూడగా తివారీ చనిపోయి ఉన్నాడు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసుపై దర్యాప్తు కోసం ఆ మహిళ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News