Friday, November 22, 2024

స్టాఫ్ నర్సుల ఆందోళన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/గోషామహాల్: స్టాఫ్ నర్స్, హెడ్ నర్సుల బదిలీల కౌన్సెలింగ్‌లో అవకతవకలు జరిగాయని కోఠి ఉస్మానియా మెడికల్ కళాశాలలో స్టాఫ్ నర్స్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. దీంతో డైరెక్టర్ ఆఫ్ ఆఫ్ హెల్త్ రవీంద్ర నాయక్ కౌన్సిలింగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేశా రు. ఈ నేపథ్యంలో స్టాఫ్ నర్సులు ఆగ్రహానికి లోనై అధికారుల తీరుపై విమర్శలు చేశారు. వైద్యవిభాగం తీరు కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేస్తూ కోఠి ఉస్మానియా మెడికల్ కళాశాల రోడ్డుపైన ఆందోళనకు దిగా రు. ఒక్కసారిగా వందలాదిమంది స్టాఫ్ నర్స్‌లు రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది.

ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాహనాలు బారులుగా నిలిచిపోవడంతో ఆ రోడ్డు పూర్తిగా దిగ్బంధనం చేసినట్టుగా మారింది. రం గంలోకి దిగిన పోలీస్ సిబ్బంది సంఖ్య లేకపోవడంతో వందలాది మంది స్టాఫ్ నర్స్‌లను అదుపు చేయలేకపోయారు. మహిళా పోలీసులు సైతం లేకపోవడంతో పోలీసులకు వారిని అదుపు చేయడం జఠిలంగా మారింది. మరిన్ని బలగాలను తెప్పించుకోవడంలో అధికారులు తీవ్ర జాప్యం చేశారనే విమర్శలు వినిపించాయి. స్టాఫ్ నర్స్‌లు తమ డిమాండ్లను వినిపిస్తూ ఆందోళన రాత్రి వరకు కొనసాగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News