Monday, January 20, 2025

5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతూనే ఉంది. న్యూఇయర్ వేళ నర్సింగ్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. శుక్రవారం 5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. డిఎంఈ, డిహెచ్ పరిధిలో 3,823 పోస్టులను భర్తీ చేయనున్నారు.

వైద్య విధాన పరిషత్‌లో 757 పోస్టులను భర్తీ చేయనున్నారు. 5,204 పోస్టులకు స్టాఫ్ నర్సుల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా ఆర్థిక, వైద్యాశాఖ మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా జరుగుతున్నట్లు మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్‌లో వెల్లడించారు. రాష్ట్రంలో నియామకాల మేళా కొనసాగుతోంది. 7,320 పోస్టులకు నియామక ప్రక్రియ చేపట్టగా, అందులో ఇప్పటికే 969 సిఎఎస్‌లను నియమించారు. స్టాఫ్ నర్సుల పోస్టుల కోసం బోర్డు వెబ్‌సైట్ (https://mhsrb.telangana.gov.in)లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

* ఖాళీల వివరాలు ఇవే..
డీఎంఈ, డీహెచ్                                     – 3,823
వైద్య విధాన పరిషత్                                   – 757
ఎంఎన్‌జె క్యాన్సర్ హాస్పిటల్                             – 81
వృద్ధులు, దివ్యాంగులు సంక్షేమం                         – 8
మైనార్టీ సంక్షేమ గురుకులాలు                         – 127
బిసి సంక్షేమ గురుకులాలు                               197
గిరిజన సంక్షేమ గురుకులాలు                           – 74
సాంఘిక సంక్షేమ గురుకులాలు                          124
రాష్ట్ర సంక్షేమశాఖ గురుకులాలు విద్యాలయాలు         – 13

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News