రాజంపేట్ ః రాజంపేట్ మండలంలోని కోండాపూర్ గ్రామంలో గల ఎస్‌బిఐ బ్యాంక్‌లో సిబ్బంది లేక ఖాతాదారులు అనేక ఇబ్బందులు పడు తున్నారు. ప్రతి రోజు చుట్టు ప్రక్కల సూమారు 12 గ్రామాల ఖాతాదారులు తమ లావదేవిలు ఇక్కడి నుండే జరుపుతారు. నిత్యం ఉదయం నుండి సా యంత్రం వరకు బ్యాంక్‌లో ఖాతాదారులు లావదేవిలు జరుపుతుంటారు. బ్యాంక్‌కు వెళ్ళి పనులు చేసుకుందామంటే బ్యాంక్‌లో అధికారులు లేక పోవడంతో అనేక ఇబ్బందులు, పనుల కోసం పడి గాపులు కాయల్సి వస్తుందని ఖాతాదారులు వాపోతున్నారు.
మెనేజర్‌తో పాటు క్యాషియర్, ఇతర మెత్తం 5 గురు సిబ్బంది ఉండాలి కాని గత నెల రోజులుగా బ్యాంక్‌లో పని చేసిన సిబ్బంది బదిలీ కాగ ఆ స్థానంలో ఎవరిని ని యామకం చేపట్టక పోవడంతో కేవలం ఇద్దరు సిబ్బందితో బ్యాంక్ లావదేవిలు నడుస్తున్నాయి. ఆ ఇద్దరు సిబ్బంది పని భారం ఎక్కవ కావడంతో తాము ఎమిచేయాలో తోచడం లేదంటున్నారని. 4గురు చేయాల్నిన పనిని ఇద్దరు చేయడంతో అనేక సమస్యలు వస్తాయని ఖాతాదారులు పేర్కొంటున్నారు. పోదుపులు చేసే ఖాతాదారులు, రుణాలు తీసుకునే మహిళలు, వృద్ధ్దులు, పింఛన్‌దారులు బ్యాంక్‌కు వచ్చి పనులు చేసుకోవడం కోసం గంటల కొద్ది సమయం పడుతుందని వాపోతున్నారు.
వారం రోజుల క్రితం సకాలంలో పనులు కాక పోవడంతో సిబ్బంది లేకపోవడంతో ఓక వృద్ధ్దుడు వేచి చూసి సోమ్మసిల్లి పడిపోయాడని ఖాతాదారులు తెలిపారు. సంబందిత ఎస్‌బిఐ అధికారులు, గ్రామ ప్రజా ప్రతినిధులు చోరువ తీసుకోని బ్యాంక్‌లో సిబ్బందిని ఎర్పాటు చెసేలా చూడాలని లావదేవిలకు అటంకం కలగకుండా సిబ్బందిని నియ మించాలని పరిసరాల ఖాతాదారులు కోరుతున్నారు.