- Advertisement -
హైదరాబాద్: తడిసిన, రంగుమారిన ధాన్యం కొంటామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతులెవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. చివరి ఆయకట్టు వరకు నీళ్లందించేందుకు ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. ప్రకృతి వనాల్లో చెట్లు ఎండకుండా ట్యాంకర్ల ద్వారా నీళ్లు పోయాలని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధి హామీ పనుల ద్వారా కాల్వల పూడికతీత పనులు ప్రారంభించాలని, అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని తెలియజేశారు.
- Advertisement -