Tuesday, November 5, 2024

తడిసి ముద్ద

- Advertisement -
- Advertisement -

Stained Paddy grain with untimely rains

అకాల వర్షాలతో ధాన్యం కుప్పలు ఆగం ..ఆగం
వరిరైతులు కన్నీరు ..మున్నీరు
తడిసినధాన్యం కొనుగోలుకు సిద్దం
రైతులకు ధైర్యం చెబుతున్న ప్రభుత్వం

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రకృతి వైపరిత్యాలు వ్యవసాయరంగాన్ని నిలువునా ముంచుతున్నాయి. అల్పపీడనాలు, అకాల వర్షాలతో ధాన్యం కుప్పలు ఆగమాగం అవుతున్నాయి. గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో ముసురు పట్టి కురుస్తున్న వర్షాలు ఆరుబయట కళ్లాల్లో ఉన్న ధాన్యం కుప్పలను తడిపి ముద్ద చేస్తున్నాయి. టార్పాలిన్ పట్టాలు సైతం ధాన్యం రాసులను తడవకుండా కాపాడలేకపొతున్నాయి. వర్షం వెలిసి కాస్త తెరిపివ్వగానే ధాన్యం ఆరబెట్టేందుకు రైతులు చేస్తున ప్రయత్నాలను ఆకస్మికంగా కురుస్తున్న వర్షాలు నీరుగారుస్తున్నాయి. పలు చోట్ల తడిసిన ధాన్యం కుప్పలను ఆరబెట్టుకునేందుకు వీలు కాకపోవటంతో కుప్పలమీదే ధాన్యం మగ్గిపోతోంది. కుప్పలపైన కప్పిన టార్పాలిన్ పట్టాలు గంటల తరబడి తొలగించే అవకాశాలు లేనిచోట్ల ధాన్యం నాణ్యత చెడి బూజెక్కుతోంది. .జాప్యం పెరుగుతన్న కొలదీ ధాన్యం మొలకలు వస్తోంది. కళ్లముందే తడిసిపోతున్న ధాన్యం రాసులను కాపాడుకోలేక రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆరుగాలం శ్రమకోర్చి పండించిన పంట తడిసి పోతుంటే జరిగే నష్టాలను తలచుకుంటూ ఆవేదన చెందుతున్నారు.

రాష్ట్రంలో ఈ ఏడాది వర్షాకాలపు సీజన్ అనుకూలించటంతో సుమారు 62లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. గత మూడు వారాలుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరి కోతలు ప్రారంభమయ్యాయి. వర్షాకాలం సాగులోకి వచ్చిన వరివిస్తీర్ణాన్ని దృష్టిలో ఉంచుకుని కోటి 40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి లభిస్తుందని ప్రభుత్వం ప్రాధమిక అంచనావేసింది. ఇంత పెద్ద ఎత్తున ధాన్యం దిగుబడి లభించే అవకాశాలు ఉండటంతో ప్రభుత్వం కూడా పంటకోతలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో 6465 కొనుగోలు కేంద్రాల ఏర్పాటును లక్షంగా పెట్టకుని ఆమేరకు అవసరమైన చర్యలు తీసుకుంది . పంట కొతలను దృష్టిలో ఉంచుకునే రైతుల డిమాండ్‌కు తగ్గట్టు దశలవారీగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించుకుంటూ పోతోంది. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఏర్పాటు చేసినకమిటీలు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలుపై సమీక్షలు నిర్వహిస్తు ,క్షేత్ర స్థాయిలో ఉత్పన్నమవుతున్న సమస్యలను చక్కదిద్దుతున్నాయి. అయినప్పటికీ సమస్యలు పుట్టుకొస్తూనే ఉన్నాయి.

మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, నల్లగొండ , సూర్యాపేట, మెదక్ , కరీంనగర్ , నిజామాబాద్, ఖమ్మం తదితర జిల్లాల్లో అకాల వర్షాల కారణంగా కళ్లాల్లో ఆరబోసిన ధాన్యంతోపాటు , ధాన్యం కుప్పలు సైతం పలు చోట్ల తడిసిపోవటంతో రైతులుఆవేదన చెందుతున్నారు. క్రమపద్దతిలో టోకెన్ల ప్రకారం రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని పౌరసరఫరాల శాఖ అధికారులు పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల రైతులు టోకేన్ సమయం కంటే ఎంతో ముందుగానే కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తెస్తుండటంతో అక్కడ ధాన్యం నిల్వలు రోజుల తరబడి పేరుకుపోతున్నాయి. తగినంతగా వసతులు లేనిచోట అకాల వర్షాలకు ధాన్యం నిల్వలు తడిసిపోత్నున్నట్టు సమాచారం.

తడిసినధాన్యం కొనుగోలు సిద్దం

అకాల వర్షాల కారణంగా తడిసిపోయిన ధాన్యం సైతం కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ధాన్యం తడిసిపోయినంత మాత్రాన రైతులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం ధైర్యం చెబుతోంది. తడిసిన ధాన్యం వీలైనంత మేరకు ఆరబెట్టుకునేందుకు ఉన్న సదుపాయాలను ఉపయోగించుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు సూచిస్తున్నారు. అవరాలను బట్టి డ్రయ్యర్లసంఖ్యను మంరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ కొనుగోలు కేంద్రాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News