Sunday, December 22, 2024

హిందీపై మరో ఉద్యమం తప్పదు: స్టాలిన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హిందీపై మరో ఉద్యమం తప్పదని తమిళనాడు సిఎం స్టాలిన్ తెలిపారు. తమిళనాడు ప్రజలపై బలవంతంగా హిందీని రుద్దుతున్నారని మండిపడ్డారు. మాతృభాషా ఉద్యమాలతో అందరికీ బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మాతృభాషల పట్ల నిర్లక్షం చేసిన బాధ్యులపై దక్షిణాది నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తామని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో మరోసారి హిందీపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. పెరుగు ప్యాకెట్లపై హిందీలో లేబుల్ ఉండాలని ఎఫ్‌ఎస్‌ఎప్‌ఎఐ తెలిపింది. దీంతో తమిళనాడు, కర్నాటకలోని పాల ఉత్పత్తి సంస్థలకు నోటీసులు జారీ చేసింది. కర్డ్ కాకుండా దహి అనే పదాన్ని వాడాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News