చెన్నై: మోడీ ప్రభుత్వం మూడో సారి వస్తే డా బిఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ఆర్‌ఎస్‌ఎస్ నియమాలతో భర్తీ చేస్తారని డిఎంకె అధ్యక్షుడు, తమిళనాడు సిఎం ఎంకె స్టాలిన్ తెలిపారు. తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో జరిగిన ర్యాలీలో స్టాలిన్ మాట్లాడారు. మోడీ మళ్లీ ప్రధాని అయితే సైన్స్ వెనక్కి నెట్టివేయబడుతుందని, మూఢనమ్మకాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని మండిపడ్డారు. అప్పుడు దేశం 200 ఏళ్లు వెనక్కి వెళ్తుందని, ఇవన్నీ ఆపాలంటే బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేయాలని సూచించారు. బిజెపికి ఓటు వేస్తే తమిళనాడు శత్రువులకు ఓటు వేసినట్టేనని పేర్కొన్నారు. అన్నాడిఎంకె, బిజెపిలు స్నేహితులు అని, ఈ ఎన్నికలలో విడిపోయినట్టుగా నటిస్తున్నారని విమర్శలు గుప్పించారు. కేంద్రం నుంచి తనకు అనేక అవార్డులు వచ్చాయని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె ప్రధాని కార్యదర్శి పళని స్వామి చెప్పుకోవడంపై స్టాలిన్ సైటెర్లు వేశారు. బానిసలలో ఉత్తముడిగా పళనిస్వామికి అవార్డులు వచ్చాయని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమిని ప్రజలు విశ్వసిస్తున్నారని జోస్యం చెప్పారు.
మోడీ మళ్లీ గెలిస్తే అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ఉండదు: స్టాలిన్
- Advertisement -
- Advertisement -
- Advertisement -