Monday, January 20, 2025

క్రైస్తవ మతంలోకి మారేవారికి ప్రయోజనాలు కల్పించాలి: స్టాలిన్ ప్రభుత్వం తీర్మానం

- Advertisement -
- Advertisement -

చెన్నై: షెడ్యూల్డ్ కులాలకు కల్పిస్తున్న ప్రయోజనాలను క్రైస్తవ మతాన్ని స్వీకరించే ఎస్‌సిలకు కూడా వర్తింపచేయాలని తమిళనాడు కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు తమిళనాడు అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. దళిత క్రైస్తవులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ప్రయోజనాలు కల్పించేవిధంగా రాజ్యాంగాన్ని సవరించాలని కేంద్రాన్ని స్టాలిన్ ప్రభుత్వం కోరింది. బిజెపి నిరసన, వాకౌట్‌ల నడుమ సిఎం స్టాలిన్ తీర్మానం చేశారు.

Also Read: బిజెపికి మరో ఎదురు దెబ్బ

క్రైస్తవ మతంలోకి మారినవారికి ప్రస్తుతం ఎస్‌సిలు పొందుతున్న రిజర్వేషన్లను వర్తింపజేయాలని కోరుతూ స్టాలిన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. ఆది ద్రావిడ్లు క్రైస్తవ మతంలోకి మారిన తరువాత వారి ప్రయోజనాలను తిరస్కరించడం తగదని స్టాలిన్ అన్నారు. విద్య, ఉద్యోగాల్లో వారికి రిజర్వేషన్ ప్రయోజనాలను వర్తింపజేస్తే వారుకూడా సామాజికంగా ఉన్నతంగా ఉంటారన్నారు. వారు వేరే మతంలోకి మారినందున వారికి అన్ని ప్రయోజనాలను నిరాకరించడం సరికాదనేది తమ ప్రభుత్వ విధానమని సిఎం స్టాలిన్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News