Monday, December 23, 2024

ముఖ్యమంత్రి కెసిఆర్‌ను అభినందించిన స్టాలిన్

- Advertisement -
- Advertisement -

చెన్నై: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ శనివారం అభినందించారు. ఈ మేరకు స్టాలిన్ ట్వీట్ చేశారు. స్టాలిన్, కెసిఆర్ అనేక అంశాలపై బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో విభేదిస్తున్నారు. హిందీ భాషను రుద్దడంపై కూడా వీరిద్దరూ రాష్ట్ర హక్కులపై గళం విప్పారు.
465 టన్నుల బరువు, 50 అడుగుల ఎత్తు ఉన్న బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహాన్ని కెసిఆర్ ఏప్రిల్ 14న ఆవిష్కరించారు. తెలంగాణ కొత్త సెక్రెటరియేట్ భవనం ప్రక్కనే ఈ విగ్రహం ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News