Sunday, December 22, 2024

ప్రధాని మోడీతో స్టాలిన్ భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ శుక్రవారం నాడిక్కడ ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకుని వివిధ సంక్షేమ పథకాల అమలు కోసం పెండింగ్ నిధులను రాష్ట్రానికి త్వరితగతిన విడుదల చేయాలని కోరారు. తమిళనాడుకు చెందిన మత్సకారుల ప్రయోజనాలను కాపాడేందుకు స్వయంగా జోక్యం చేసుకోవాలని కూడా స్టాలిన్ ప్రధాని మోడీని అభ్యర్థించినట్లు రాష్ట్ర అధికారి ఒకరు తెలిపారు. సమావేశం అనంతరం స్టాలిన్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సోనియా గాంధీని కలుసుకున్నారు. సెప్టెంబర్ 28న(శనివారం) కాంచీపురంలో జగరనున్న బహిరంగ సభలో పాల్గొనవలసిందిగా సోనియాను ఆయన ఆహ్వానించారు. ఈ సభకు ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన నాయకులు హాజరుకానున్నారు. గురువారం సాయంత్రం దేశ రాజధానికి వచ్చిన స్టాలిన్‌కు డిఎంకె నాయకులు స్వాగతం పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News