Monday, January 20, 2025

డిఎంకె అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికయిన స్టాలిన్

- Advertisement -
- Advertisement -
Stalin reelected as DMK party president
కనిమొళికి కొత్త పార్టీ పదవి 

చెన్నై:  డిఎంకె సాధారణ మండలి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ను రెండోసారి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. డిఎంకె ఎంపీ కనిమొళిని డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఎన్నుకుంది. కాగా నీటిపారుదల మంత్రి దురైమురుగన్ మరోసారి జనరల్ సెక్రటరీగా, కేంద్ర మంత్రి టిఆర్ బాలు కోశాధికారిగా ఎన్నికయ్యారు. డిఎంకె జనరల్ కౌన్సిల్ లో చెప్పుకోదగ్గ మార్పు ఏమిటంటే సహకార మంత్రి ఐ.పెరియసామి, ఉన్నత విద్యా శాఖ మంత్రి కె.పొన్ముడి, మాజీ కేంద్ర మంత్రి ఏ.రాజా, ఎంపీ అంతియూర్ సెల్వరాజ్ తో పాటు పార్లమెంటు సభ్యురాలు కనిమొళి డిప్యూటీ జనరల్ సెక్రటరీగా పదోన్నతి పొందారు. ఇటీవల మాజీ మంత్రి సుబ్బులక్ష్మి జగదీశన్ పార్టీకి రాజీనామా చేయడంతో కనిమొళి ఆమె స్థానంలో డిప్యూటీ జనరల్ సెక్రటరీ అవుతారాన్నది ఇదివరకే స్పష్టం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News