Sunday, December 22, 2024

పాట్నా విపక్ష భేటీకి స్టాలిన్

- Advertisement -
- Advertisement -

తిరువూరు : పాట్నాలో ఈ నెల 23వ తేదీన జరిగే ప్రతిపక్ష నేతల సమావేశానికి తమిళనాడు ముఖ్యమంత్రి , డిఎంకె నేత ఎంకె స్టాలిన్ హాజరవుతారు. ఈ విషయాన్ని ఆయన మంగళవారం ఇక్కడ వెల్లడించారు. బిజెపికి వ్యతిరేకంగా దేశంలోని విపక్షాలను ఒకేతాటికి తీసుకువచ్చేందుకు, లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం అయ్యేందుకు నితీశ్‌కుమార్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు అయింది.

ద్రవిడ దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి ఎం కరుణానిధి శతజయంతి నేపథ్యంలో ఆయన పేరిట నిర్మించిన కళైంగర్ కొట్టామ్ ఆవిష్కరణ తరువాత స్టాలిన్ విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ ప్రసాద్ యాదవ్ కూడా హాజరయ్యారు. దేశ ప్రజాస్వామ్య పరిరక్షణకు జరిగే విపక్ష సదస్సుకు తాను వెళ్లుతున్నట్లు స్టాలిన్ తెలిపారు. ఇక్కడి కార్యక్రమంలో పాల్గొనేందుకు బీహార్ నుంచి వచ్చిన తేజస్వీయాదవ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News