Sunday, December 22, 2024

స్టాలిన్ జన్మదినం శిశువులకు ఉంగరాలు

- Advertisement -
- Advertisement -

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ జన్మదినం మార్చి 1వ తేదీ నేపథ్యంలో దీనిని ఘనంగా నిర్వహించేందుకు డిఎంకె సన్నాహాలు చేపట్టింది. ఎక్కువగా ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలని సంకల్పించారు. నవజాత శిశువులకు బంగారు ఉంగరాలు బహుకరించాలని నిర్ణయించారు.

సంక్షేమ కార్యక్రమాలు, బహిరంగ సభలు , క్రీడా సాంస్కృతిక వేడుకలు నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి స్టాలిన్ 70వ జన్మదినం సందర్భంగా జరిగే బహిరంగ సభకు కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే , ఫరూక్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్ ఇతర నేతలు కూడా హాజరవుతారు. స్థానిక వైఎంసిఎ గ్రౌండ్స్‌లో సభ జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. తమ నేత స్టాలిన్ ద్రవిడ నాయకుడు అని డిఎంకె వర్గాలు ఇప్పటికే కటౌట్లు సిద్ధం చేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News