Monday, December 23, 2024

మధురై ఉత్సవాలలో తొక్కిసలాట

- Advertisement -
- Advertisement -

stampede at Madurai festival

ఇద్దరు దుర్మరణం ఏడుగురికి గాయాలు

మధురై : తమిళనాడులో మధురై చితిరై ఉత్సవంలో జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఏడుగురు గాయపడ్డారు. ఏటా ఈ కాలంలో మధురై చితిరై పేరిట ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ కళ్లాజగర్ దేవుడు సమీపంలోని వైగాయ్ నదిలోకి లాంఛనంగా చేరుకోవడం భక్తులు సాంప్రదాయవాదులు పెద్ద ఎత్తున పండుగా నిర్వహించుకుంటారు. వేలాదిగా జనం తరలివస్తారు. నదిలోకి ప్రవేశఘట్టం తిలకించేందుకు జనం ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ప్రమాదంలో ప్రాణాలు పొయ్యాయి. జరిగిన ఘటనపై సిఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News