Sunday, December 22, 2024

పూరీ ఆలయంలో తొక్కిసలాట..

- Advertisement -
- Advertisement -

పూరీ: ఒడిశాలోని సుప్రసిద్ధ పూరీ జగన్నాథ ఆలయంలో శుక్రవారం తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పది మంది భక్తులు స్పృహతప్పిపడిపోయారు. క్షతగాత్రులను పూరీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఉదయం‘మంగళ ఆరతి’ నిర్వహించిన అనంతరం భక్తులను లోపలికి అనుమతించడంతో ఆలయం మెట్ల వద్ద ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆలయంలోని ఘంటిద్వార, సతపహచ సమీపంలో తొక్కిసలాట జరిగింది. ఆలయం బయట వేచి ఉన్న భక్తులు ఒక్కసారిగా లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించినట్లు గాయపడిన ఓ మహిళ చెప్పారు.

ఈ తోపులాటలో తాను కింద పడిపోయానని, జనం తనమీదనుంచి వెళ్లారని ఆమె చెప్పారు. పోలీసులు వెంటనే తనను లేపి ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఒడిశా పంచాగం ప్రకారం గత పౌర్ణమినుంచి కార్తీక మాసం ప్రారంభమైంది.కార్తీక మాసంలో పవిత్రమైన శుక్రవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయ దర్శనానికి వచ్చారు. కాగా గాయపడిన వారిలో చాలా మంది వృద్ధులని, ప్రాథమిక చికిత్స తర్వాత అందరినీ డిశ్చార్జి చేసినట్లు జగన్నాథ ఆలయం చీఫ్ అడ్మినిస్ట్రేటర్ రంజన్‌కుమార్ దాస్ చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News