Monday, December 23, 2024

సూరత్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల తొక్కిసలాట..

- Advertisement -
- Advertisement -

సూరత్ : దీపావళి సందర్భంగా గుజరాత్ లోని సూరత్ రైల్వే స్టేషన్‌కు సొంత ఊళ్లకు వెళ్లడానికి భారీగా వేలాది మంది  ప్రయాణికులు శనివారం తరలి వచ్చారు. వీరంతా రైళ్లు రాగానే ఒక్కసారిగా రైలు లోకి ఎక్కేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగి ఒకరు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. సూరత్ నుంచి చాప్రాకు వెళ్లే తాపీ గంగా ఎక్స్‌ప్రెస్ రైలు నాలుగో నెంబరు ప్లాట్‌ఫారమ్ వద్దకు రాగానే ప్రయాణికుల తొక్కిసలాట జరిగింది. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించగా, అక్కడ చనిపోయాడు. మృతుడు అంకిత్ వీరేంద్రసింగ్ బీహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News