Monday, December 23, 2024

యెమన్ లో తొక్కిసలాట: 85 మంది మృతి

- Advertisement -
- Advertisement -

సనా: యెమన్ దేశ రాజధాని సనాలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో దాదాపుగా 85 మంది చనిపోగా వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాబ్ ఆల్ యెమన్‌లోని హుతీలో ఓ స్వచ్ఛంద సంస్థ ఆర్థిక సాయం చేస్తుండగా ప్రజలు వేల సంఖ్యలో అక్కడికి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 85 మంది మృతి చెందగా 322 మందికి పైగా గాయపడ్డారని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ ఇద్దరు నిర్వహకులను అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా సనాలోని ఓల్ట్‌సిటీ శోకసంద్రంలో మునిగిపోయింది. మృతుల కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News