Monday, December 23, 2024

మిలిటరీ స్టేడియంలో తొక్కిసలాట: 37 మంది మృతి

- Advertisement -
- Advertisement -

కిన్షాసా : ఆఫ్రికా దేశమైన రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మిలిటరీ స్టేడియంలో మంగళవారం జరిగిన తొక్కిసలాటలో 37 మంది ప్రాణాలు కోల్పోగా, మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. బ్రజ్జావిల్లేలో గత వారం రోజులుగా సైన్యంలో ఖాళీగా ఉన్న 1500 పోస్టుల భర్తీకి మిలిటరీ స్టేడియంలో నియామక ర్యాలీ జరుగుతోంది. రోజూ వందల సంఖ్యలో యువత నియామక ర్యాలీలో పాల్గొనేందుకు స్టేడియం బయట లైన్లలో వేచి ఉంటున్నారు. మంగళవారం చివరి రోజు కావడంతో ఊహించిన దానికంటే పెద్ద సంఖ్యలో వచ్చారు. వాళ్లను అదుపు చేయడం నిర్వాహకులకు సాధ్యం కాలేదు. ఒక్కసారిగా వాళ్లంతా స్టేడియం లోకి వెళ్లడానికి ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News