Sunday, December 22, 2024

రాహుల్ సభలో తొక్కిసలాట

- Advertisement -
- Advertisement -

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫూల్‌పూర్‌లో సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ హాజరైన సభలో తొక్కిసలాట జరిగింది.పలువురికి గాయాలయ్యాయి. సభకు వచ్చిన జనం ప్రయాగ్‌రాజ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి, ఫూల్‌పూర్‌లో ఎస్పీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. వీరిద్దరికీ మద్దతుగా ఉమ్మడి ఎన్నికల సభ నిర్వహించారు. ఎస్పీ అభ్యర్థి అమర్‌నాథ్ మౌర్యకు మద్దతుగా బహిరంగ సభ నిర్వహించేందుకు ఇద్దరు నేతలు వచ్చారు.

సభకు వచ్చే జనం వేదికకు దగ్గరగా వచ్చేందుకు ప్రయత్నం చేయడంతో తొక్కిసలాట జరిగింది.దాంతో సభా ప్రాంగణం నుంచి ఇద్దరు నేతలు వెళ్లిపోయారు. పార్టీ కార్యకర్తలు శాంతించాలని అఖిలేష్, రాహుల్ ఎంతగా అభ్యర్థించినా ఫలించలేదు. ఉత్సాహంగా ఉన్న జనాన్ని అదుపు చేసేందుకు పోలీస్‌లు, భద్రత సిబ్బంది నానా తంటాలు పడ్డారు. రాహుల్, అఖిలేష్ యాదవ్ ఇద్దరూ వేదికపై కొద్దిసేపు చర్చలు జరిపారు. పరిస్థితి అదుపు లోకి రాకపోవడంతో వారు సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోయారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News