Monday, March 31, 2025

కుణాల్ కామ్రాకు ముందస్తు బెయిల్ మంజూరు

- Advertisement -
- Advertisement -

స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రా కు మద్రాస్ హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే పై ఇటీవల కుణాల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయనపై పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, ఏప్రిల్ 7 వరకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కుణాల్ తన పిటిషన్‌లో ముంబై నుంచి 2021లో తమిళనాడుకు తరలి వచ్చానని, ఒక సామాన్యునిలా జీవిస్తున్న తనకు ముంబై పోలీసులు అరెస్ట్ చేస్తారేమో అన్న భయంతో ఉన్నానని పేర్కొన్నారు. కుణాల్ తన షోలో ప్రత్యేకంగా ఎవరినీ ప్రస్తావించలేదని, అతడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే ఈ కేసులు మహారాష్ట్రలో నమోదైనప్పటికీ, కుణాల్ తమిళనాడు లోని విల్లుపురానికి చెందిన వ్యక్తి కావడంతో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News