Monday, December 23, 2024

ప్రేమ కోసం పోరాటం చేయాలి

- Advertisement -
- Advertisement -


రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన సినిమా ‘స్టాండప్ రాహుల్’. శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్లపై నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథులుగా వరుణ్‌తేజ్, అనిల్‌రావిపూడి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ “స్టాండప్ కామెడీ ద్వారా నవ్వించడం కష్టం. ఇందులో కామెడీనే కాదు చాలా అంశాలున్నాయని చిత్ర యూనిట్ చెబుతోంది”అని అన్నారు. దర్శకుడు శాంటో మాట్లాడుతూ “మనం దేన్నయినా ఇష్టపడితే, ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ల కోసం నిలబడాలి, పోరాటం చేయాలని చెప్పే సినిమా ఇది. రాజ్‌తరుణ్, వర్ష అద్భుతంగా నటించారు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వర్ష బొల్లమ్మ, సిద్ధు, సాగర్ కె.చంద్ర, కిరణ్ కొర్రపాటి, శ్రీకర్ అగస్తీ, శ్రీరాజ్ రవీంద్రన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News