9 అంశాలకు స్టాండింగ్ కమిటీ ఆమోద ముద్ర
నగర అభివృద్దే లక్షంగా జిహెచ్‌ఎంసి చర్యలు ః మేయర్ విజయలక్ష్మి
మన తెలంగాణ/సిటీ బ్యూరో: నగర అభివృద్దే లక్షంగా జిహెచ్‌ఎంసి అనేక చర్యలు చేపడుతుందని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. మేయర్ అధ్యక్షతన బుధవారం జిహెచ్‌ఎంసిస్టాండింగ్ కమిటీసమావేశం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కమిటీసభ్యుల సహకారంతోస్టాండింగ్ కమిటీసమావేశంలో 9 అంశాలకు ఆమోదం ముద్ర వేసినట్లు తెలిపారు. .స్టాండింగ్ కమిటీసభ్యులు పన్నాల దేవేందర్ రెడ్డి, మహ్మద్‌అబ్దుల్ సలాం షాహిద్, మహపర, మిర్జా ముస్తఫా బేగ్, పర్వీన్ సుల్తానా, మందగిరి స్వామి, బాత జబీన్, ఇ.విజయ్ కుమార్ గౌడ్, సి.ఎన్.రెడ్డి, మందడి శ్రీనివాసరావు, సామల హేమ హజరయ్యారు. ఈ సమావేశంలో కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, ఇ.వి.డి.ఎం. డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, ఈ.ఎన్.సి జియా ఉద్దీన్, సి.ఇ ప్రాజెక్ట్ దేవానంద్, అడిషనల్ కమిషనర్లు శృతి ఓజా, బి.సంతోష్, విజయలక్ష్మి, జయరాజ్ కెన్నడి, చీఫ్ ఎంటమాలజీ డా.రాంబాబు, అడిషనల్ సిసిపి శ్రీనివాస్, చీఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్ రెడ్డి, జోనల్ కమిషనర్లు శంకరయ్య, మమత, పంకజ, శ్రీనివాస్ రెడ్డి, సామ్రాట్‌అశోక్, ఎస్.ఎన్.డి.పి సిఈ వసంత, సెక్రటరీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
స్టాండింగ్ కమిటీలో 9 అంశాలకు ఆమోదం:
1. చీఫ్ ఎగ్జామినర్ అకౌంట్ ద్వారా 2022 జూలై నెలకు సంబంధించిన ఆదాయ వ్యయాలనుకు ఆమోద ముద్ర.
2. జిహెచ్‌ఎంసి ఎన్నికల విభాగం ఎస్ ఈసీ కన్సల్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న సిహెచ్ రవీంద్రనాథ్ రిటైర్డ్ జాయింట్ సెక్రటరీ సేవలను 20022 జూలై 1 నుంచి 2023 జూన్ 30రకు పొడిగిస్తూ రెమ్యూనరేషన్ ను నెలకు రూ. 55వేలు, రూ. 34 వేల కన్వీనియన్స్ అలవెన్సులు చెల్లించేందుకు ఆమోదం.
3. శేరిలింగంపల్లి జోన్ ఈపిటిఆర్‌ఐ చెరువు సుందరీకరణ,హెర్బల్ పార్క్ అభివృద్ధితో పాటు ఏడాది నిర్వహణకు సిఎస్‌ఆర్ కింద వర్టికల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ తో ఒప్పందం.
4. శేరిలింగంపల్లి జోన్ లో జిహెచ్‌ఎంసి శేరిలింగంపల్లి జోనల్ ఆఫీస్ వయా నల్లగండ్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి నుండి బిహెచ్‌ఇఎల్ జంక్షన్ వరకు ప్రతిపాదిత 150 మీటర్ల వెడల్పు రోడ్డు, గుల్మొహర్ పార్క్ వద్ద జంక్షన్ల అభివృద్ధి చేసేందుకు గాకు సి.ఎస్.ఆర్ కింద లీగల గ్రూప్‌తో జోనల్ కమిషనర్ అనుమతికి కమిటీ ఆమోదం.
5. శేరిలింగంపల్లి జోన్‌లోని బయోడైవర్సిటీ మొదటి, రెండవ లెవెల్స్ కింద సెంట్రల్ మీడియం ట్రాఫిక్ ఐలాండ్ మూడేళ్ల నిర్వహణకు సి.ఎస్.ఆర్ కింద యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ కు పరిపాలన, అనుమతికి కమిటీ ఆమోదం.
6. సికింద్రాబాద్ జోన్ లో ఆర్.డి.పి కింద మల్లాపూర్ జంక్షన్ నుండి శివ హోటల్ వరకు ప్రతిపాదిత 60 మీటర్ల రోడ్డు వెడల్పు చేయడానికి 78 ఆస్తుల సేకరణ కు కమిటీ ఆమోదం.
7. నల్లగండ్ల గ్రామంలో 400/ఎఎ1/1 సర్వేనెంబర్ లో గల శివరాజు కు చెందిన ఖాళీ స్థలంలో 2,155.99 మీటర్లు గల హెచ్‌యుడిఎ ఆమోదించిన భూమిని వనజ హౌసింగ్ ఎల్‌ఎల్‌సిపికి బదిలీ చేయుటకు ప్రభుత్వ అనుమతి నివేదనకు ఆమోదం.
8. హుస్సేన్ సాగర్ నాలా పై అరవింద్ నగర్ వద్ద నిర్మించిన నాలపై స్లాబ్ ను తొలగించి రూ. 2.99 కోట్ల వ్యయంతో బ్రిడ్జి పున:నిర్మాణానికి పరిపాలన అనుమతుల మంజూరుకు కమిటీ ఆమోదం.
9. 2022 ఆగష్టు 31 నాటికి వచ్చిన ఆదాయ, వ్యయాలకు ఆమోదం.