Tuesday, January 21, 2025

స్టాండప్ కామెడీతో మంచి వినోదం

- Advertisement -
- Advertisement -

హీరో రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన సినిమా ‘స్టాండప్ రాహుల్’. శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ , హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్‌లపై నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించారు. ఈ సినిమా ఈనెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ “అలరించే కామెడీ పాటు మంచి ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయి. దర్శకుడు ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు”అని అన్నారు.

దర్శకుడు శాంటో మాట్లాడుతూ “యూత్‌కు స్ఫూర్తిగా ఉండేలా ఈ సినిమా కథ రాసుకున్నాను. మన కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి.వాటిని స్టాండప్ కామెడీతో ఎలా వినోదాత్మకంగా చెప్పించవచ్చో ఈ సినిమాలో చూపించాము”అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో హీరోయిన్ వర్ష బొల్లమ్మ, నిర్మాతలు భరత్ మాగులూరి, నందకుమార్ అబ్బినేని, సంగీత దర్శకుడు శ్రీకర్ అగస్తి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News