Monday, January 20, 2025

ఇంటర్నెట్ టీనేజ్ స్టార్ పోసీ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Star Kailia Posey allegedly committed suicide

ఓ అందమైన నవ్వు రాలిన పువ్వైంది
ఇంటర్నెట్ టీనేజ్ స్టార్ పోసీ ఆత్మహత్య
కెనడా సరిహద్దులలో పార్క్‌లో మృతదేహం

వాషింగ్టన్ : ఇంటర్నెట్‌లో పేరు మోసిన టీనేజ్ స్టార్ కైలియా పోసీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె వయస్సు కేవలం 16 సంవత్సరాలు. ఆమె మరణం గురించి కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. ఈ యువతి టిఎల్‌సికి చెందిన టాడ్లర్స్ అండ్ టియారస్‌లో కన్పించి తన ఐదేళ్ల చిన్నతనంలోనే పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో చిర్నవ్వుల ఆమె ఫోజు త్రిడి రూపంలో అందరి మన్ననలు పొందింది. కూతురు విషాద మరణం గురించి తెలియచేయడానికి తాను చింతిస్తున్నానని తల్లి మెర్సీ పోసీ గట్టర్‌మాన్ ఫేస్‌బుక్ ద్వారా తెలియచేశారు. ఈ బాధను పంచుకోవడానికి తన వద్ద ఎటువంటి పదాలు ఆలోచనలు లేవని చింతించారు. అందమైన చిన్నారి వెళ్లిపోయిందని , ఇప్పుడు ఆమె గురించి మననం చేసుకునేందుకు దయచేసి మాకు ప్రేవసీ కల్పించండని వేడుకున్నారు. ఆమె ఎన్ని జన్మలకైనా తన బేబీనే అని వ్యాఖ్యానించారు. వాషింగ్టన్ స్టేట్‌లోని బిర్చ్ బే స్టేట్ పార్క్‌లో ఆమె మృతదేహం కన్పించిందని వార్తలు తెలిపాయి. ఈ పార్క్ కెనడా సరిహద్దులకు కొద్ది మైళ్ల దూరంలోనే ఉంది. ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాధమిక దర్యాప్తులో తేలింది. బంగారు భవిష్యత్తు ఉన్న టీనేజర్ ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడటం అనుచితం అన్పిస్తోందని , ఇది తప్పుడు నిర్ణయం అని టిఎంజడ్ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News