- Advertisement -
వాహన కంపెనీలకు కొత్త విధానం: గడ్కరీ
న్యూఢిల్లీ : క్రాష్ టెస్ట్‌లో పనితీరు ఆధారంగా వాహన కంపెనీలకు స్టార్ రేటింగ్ ఇచ్చే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దేశంలో ఆటోమొబైల్ కంపెనీలకు కొత్తగా అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ భారత్ ఎన్‌సిఎపిని ప్రతిపాదించామని శుక్రవారం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్(ఎన్‌సిఎపి)తో వినియోగదారులకు సురక్షితమైన కార్లను అందించాలని ఈ రేటింగ్ విధానాన్ని తీసుకొచ్చామని ఆయన వివరించారు. అదే సమయంలో వాహన తయారీ కంపెనీల్లో ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం సృష్టించడమే ఈ కొత్త విధానం ఉద్దేశమని మంత్రి వివరించారు. భారత్ ఎన్‌సిఎపి నమూనా జిఎస్‌ఆర్ నోటిఫికేషన్‌కు తాను ఆమోదం తెలిపానని, ఇకపై క్రాష్ టెస్ట్‌లలో పనితీరు ఆధారంగా దేశీయ కంపెనీలకు స్టాక్ రేటింగ్ ఉంటుందని అన్నారు.
- Advertisement -