Thursday, January 23, 2025

కోహ్లీ ఔటా?.. కాదా?: వివాదంపై స్పందించిన స్టార్ స్పోర్ట్స్

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 2024లో భాగంగా కోల్ కతా జట్టుతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఔటైన తీరు వివాదాస్పదమైంది. కోల్ కతా బౌలర్ హర్షిత్‌ రాణా బౌలింగ్ కోహ్లీ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే.. బంతి ఫుల్ టాస్ రూపంలో రావడంతో కోహ్లీ.. నో- బాల్ కోసం రివ్యూ కోరాడు. ఈక్రమంలో థర్డ్ అంపైర్ ఫెయిర్ డెలివరిగా నిర్ణయిస్తూ కోహ్లీని ఔట్ గా ప్రకటించాడు. దీంతో కోహ్లీ ఆన్ ఫీల్డ్ అంపైర్స్ తో వాగ్వాదానికి దిగి అసహనం వ్యక్తం చేస్తూ పెవిలియన్ చేరాడు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నో బాల్ అయినా కోహ్లీని ఔట్ గా ప్రకటించారంటూ అభిమానులు దుమెత్తిపోస్తున్నారు. ఈక్రమంలో స్టార్ స్పోర్ట్స్ స్పిందించింది. బంతి కోహ్లీ నడుము కంటే హైట్ వచ్చింది నిజమేనని.. కానీ కోహ్లీ క్రీజుల వదిలి రావడంతో థర్డ్ అంపైర్ ఔట్ గా ప్రకటించారని తెలిపింది. ఒకవేళ కోహ్లీ క్రీజులోనే ఉంటే అతని నడుము కంటే తక్కవ ఎత్తులోనే బంతి వచ్చేదని స్పష్టం చేసింది.

కాగా, నరాలు తెగే ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో బెంగళూరుపై కోల్ కతా ఒక పరుగు తేడాతో గెలుపొందింది. 223 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు చివరి వరకు పోరాడి పరాజయం పాలైంది. చివరి బంతికి మూడు పరుగులు అవసరం కాగా.. రెండో పరుగు కోసం ప్రయత్నించి బెంగళూరు బ్యాటర్ ఫర్గుసన్ రన్ ఔట్ కావడంతో కోల్ కతా ఉత్కంఠ విజయం సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News