విశాఖపట్నం: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్ మిచ్ స్టార్క్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి.. సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపించాడు. దీంతో ఢిల్లీకి సన్‌రైజర్స్ 164 పరుగుల స్వల్ప టార్గెట్‌ను ముందుంచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్లు ఢిల్లీ బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయారు. యువ బ్యాట్స్‌మెన్ అనికేత్ వర్మ (74) ఒంటరి పోరాటం చేసినప్పటికీ.. ఇతర బ్యాట్స్‌మెన్ల నుంచి సరైన సహకారం అందలేదు. అనికేత్‌తో పాటు క్లాసెన్(34), హెడ్(22) మినహా మిగితా బ్యాట్స్‌మెన్లు అందరూ సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. స్టార్క్‌తో పాటు కుల్దీప్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఫామ్‌తో బ్యాటింగ్ చేస్తున్న అనికేత్‌తో పాటు మరో రెండు వికెట్లను పడగొట్టాడు. ఇక మోహిత్ శర్మ కూడా ఒక వికెట్ తీశాడు. దీంతో సన్‌రైజర్స్ 18.4 ఓవర్లలో 163 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
స్టార్క్ అద్భుత ప్రదర్శన.. సన్‌రైజర్స్ ఆలౌట్.. టార్గెట్ ఎంతంటే..
- Advertisement -
- Advertisement -
- Advertisement -