Thursday, January 23, 2025

ఉచిత వైద్య సేవలు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

కరకగూడెం : కరకగూడెం మండలంలో ఎంబిబిఎస్ పూర్తి చేసి మణుగూరు మండలంలో ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులుగా పని చేస్తున్న డాక్టర్ బైరిశెట్టి దుర్గ నరేష్ తన పుట్టిన గ్రామానికి తన కరకగూడెం మండల ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలనే దృక్పధంతో ఉచిత వైద్యం అందిస్తూ ఔదార్యం చాటుకుంటు ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఈ క్రమంలో కేంద్రంలో ఉచిత వైద్యశాల ఏర్పాటు చేయగా గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ మారుమూల ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలను అందిస్తున్న డాక్టర్ దుర్గ నరేష్‌ను అభినందించి, శాలువాతో సన్మానించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని ప్రభుత్వ వైద్యశాలలపై ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం డాక్టర్ దుర్గ నరేష్ మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివి ప్రజలకు సేవ చేయాలని వైద్య వృత్తిని ఎంచుకుని నిరుపేదలకు ఉచిత వైద్యం చేయాలని నేను పుట్టి పెరిగిన నా ప్రజలకు సేవ చేయడంలో ఆనందంగా ఉందన్నారు.

ప్రజలు ప్రైవేటు వైద్యశాలలకు, ఆర్ ఎంపీల వద్దకు వెళ్ళి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగా కాళికా, బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య, సర్పంచ్ ఊకే రామనాథం, బుడగం రాము, చిరంజీవి, సతీష్ దిలీప్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News