Thursday, January 23, 2025

కంటి ఆసుపత్రిలో గ్రీన్‌లేజర్ సేవలు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ గురువారం లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ డాక్టర్ భాస్కర్ మాడేకర్ నేత్ర వైద్యశాలను సందర్శించి రూ. 49.50 లక్షల విలువైన అత్యాధునిక నేత్ర పరీక్షల మిషన్‌ను ప్రారంభించారు. ఈ ఎలక్ట్రానిక్ ఉపకరణం ఉపయోగించి మధుమేహ బాధితులు వారి డయాబెటిక్ రేటినోపతి వ్యాధికి సులభంగా చికిత్స చేయబడుతుంది.

జిల్లా కలెక్టర్ ఆసుపత్రిలోని పలు ఆధునిక నేత్ర వైద్య పరికరాలైనా ఓసీటీ మధుమేహ బాధితులకు స్కానింగ్ ద్వారా కంటికి మధుమేహం వల్ల కలిగే నష్టాన్ని పరీక్షించవచ్చనని, ఐఓఎల్ మాస్టర్ ద్వారా ఖచ్చితమైన లెన్స్ వేయవచ్చనని, హెచ్‌ఎఫ్‌ఎ ద్వారా గ్లకోమా వ్యాధిగ్రస్తులు తమ కంటికి జరుగుతున్న నష్టాన్ని పరీక్షించగల పలు పరికరాలను చూసి సంతోషం, ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్ కొండా వేణుమూర్తి, ప్రకాశ్‌హోల్లా, డాక్టర్ టి మురళీధర్ రావు, బొమ్మ పవన్‌కుమార్, కోల అన్నారెడ్డి, ట్రస్టు బోర్డు సభ్యులు, క్లబ్ అధ్యక్షుడు లంబు సుధాకర్‌రెడ్డి, ఆర్‌సీ పెద్ది విద్యాసాగర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News