Saturday, January 11, 2025

ఒలింపియాడ్ టార్చ్ రిలే ప్రారంభం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : మహాబలిపురం వేదికగా జరగనున్న 44వ చెస్ ఒలింపియాడ్ నేపథ్యంలో టార్చ్ రిలేను రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. శనివారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో 44 వ చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలేను క్రీడాకారులతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో రాష్ట్ర స్పోరట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి జగదీశ్వర్‌యాదవ్, రాష్ట్ర చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు కెఎస్ ప్రసాద్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హరిత, గ్రాండ్ మాస్టర్‌లు అర్జున్‌కుమార్, విజయసారధి, శరత్ చంద్రయాదవ్, విజయరావు, గ్రాండ్ మాస్టర్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News