మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ అధ్యర్యంలో నడుస్తున్న హెపిసిఎల్ పెట్రోల్ బంకులో తొలిసారి పవర్ 95పెట్రోల్ సేవలను ప్రారంభించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కవాడిగూడ పెట్రోల్ బంక్‌లో సోమవారం నాడు హెపిసిఎల్ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ సందీప్ మహేశ్వరి ఈ సేవలను ప్రారంభించారు. ఈ సందర్బంగా సందీప్ మహేశ్వరి మాట్లాడుతూ నగరంలో మొట్టమొదటి సారి పవర్ 95పెట్రోల్ సేవలను ప్రారంభించామని, దీనివల్ల కాలుష్యం తగ్గటంతోపాటు వాహనాల మైలేజ్ కూడా పెరుగుతుందని వెల్లడించారు.
Also Read: ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్న బిజెపి: రాహుల్ ఆరోపణ
అంతే కాకుండా వాహనాల మెయింటినెన్స్ సమస్యలు కూడా తక్కువగా వుంటాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు సెక్రటేరియట్ సమీపంలో ఉన్న ఈ పెట్రోల్ బంక్‌ను కేవలం 25రోజుల్లో 1.30కోట్లు వ్యయం చేసి బంక్‌ను తిరిగి ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫాల సంస్థ అధిఆకరులు సాయికుమార్ ,హరిప్రసాద్ , వైపి సింగ్ తదితరులు పాల్గొన్నారు.