Sunday, December 22, 2024

సోలార్ విద్యుత్ ఏర్పాటు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

సత్తుపల్లి : సత్తుపల్లి పట్టణ శివారులోని శ్రీ లలిత శ్రీ గాయత్రి సహిత జ్ఞాన సరస్వతి ఆలయంలో మంగళవారం సోలార్ విద్యుత్ ఏర్పాటును ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించారు. ఆలయ నిర్వహణకు విద్యుత్ వినియోగార్ధం దాతలు కోడిమేల నిర్మల దేవి జ్ఞాపకార్ధం కొండా అనిల్ కృష్ణ శర్మ దీప్తి శ్రీ దంపతులు, వల్లిశ్రీ తోలేటి దంపతులు, రాజశేఖర్ తోలేటి దంపతులు విశ్వ విపాక తదితరులు రూ.3,35,000లతో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించారు. ఆలయ నిర్వాహణకు సహకారంగా దాతృత్వంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయం అని అన్నారు.

ఈ సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను, అతిధులను ఆలయ కమిటీ వారు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, డిసిసిబి డైరెక్టరు చల్లగుళ్ళ కృష్ణయ్య, ఆలయ అధ్యక్షులు కోడిమెళ్ళ అప్పారావు, కోశాధికారి పుల్లారావు, గౌరవ అధ్యక్షులు జగన్మహాన్ రావు , వైస్ ప్రెసిడెంట్ శర్మ , అలవాల శ్రీనివాసరావు, ఊటుకూరి వినోద్, మల్లిఖార్జున్, మాదిరాజు కృష్ణారావు, కొండపల్లి విజయ్ కుమార్ తదితరలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News