Wednesday, January 22, 2025

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నెల రోజులు నడపాలి: రఘునందన్‌రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ఒక్కసారి కూడా అసెంబ్లీని నెల రోజులు నడవక పోవడం చాలా బాధాకరం అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నాలాంటి చిన్న సభ్యుడితో సీనియర్ అయిన సిఎం కెసిఆర్ అనిపించుకోవడం జాలి కలుగుతుందన్నారు. శాసన సభను నడిపించడంలో ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం సాఫ్ట్ వేర్ కంపెనీలకి సమయం మార్పులు చేయడం అభివృద్ధి కాదని అసెంబ్లీని కనీసం 30 రోజులు నడపాలని కోరారు. వరద నష్టం కేంద్ర సహాయంపై అఖిల పక్షం సమావేశం ఏర్పాటు చేస్తే తాము ఎంత ఇచ్చామో చెబుతామని వెల్లడించారు. రైతు రుణమాఫీపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ బ్యాంక్‌ల ముందు ధర్నా చేస్తుందని ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీ కోసం సచివాలయం ముందు, మంత్రి ఇంటి ముందో చేయాలని, ఇది కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా అంటూ విమర్శించారు. మా జిల్లాలో రెగ్యులర్ ఉద్యోగులు ఎందరో కాంట్రాక్ట్ ఉద్యోగుల ఎందరో చర్చకు సిద్దమని, రాష్ట్రంలో ప్రభుత్వం భూములు అమ్మితే ఎంత వచ్చింది, ఎక్కడ ఖర్చు చేశారనే విషయాలు వెల్లడించాలన్నారు. మైనార్టీలందరికీ లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటన చేశారు, బిసిలకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. భాగ్యనగర్‌లో ఎంతమందికి ఇండ్లు కావాలో మంత్రి కెటిఆర్ దగ్గర గణాంకాలున్నాయా అని అడిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News