Friday, January 10, 2025

నేడు రాష్ట్ర కేబినెట్ సమావేశం

- Advertisement -
- Advertisement -

మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం

మొత్తం 20 నుంచి 25 అంశాల అజెండాపై చర్చ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర కేబినెట్ సిఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నాం మూడు గంటలకు సమావేశం కానుంది. ఆరు గ్యారెంటీల్లోని మరో రెండుపథకాల అమలు, బడ్జెట్ సమావేశాల అజెండాగా చర్చనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 20 నుంచి 25 అంశాల అజెండాతో ఈ సమావేశం జరిగే అవకాశం ఉన్నట్లు చెప్పా రు. ఏజెండాలో భాగంగా రూ.500లకే సిలిండర్, 200 యూనిట్‌ల వరకు ఉచిత విద్యుత్, గవర్నర్ దగ్గర నిలిచిపోయిన జిఎస్టీకు సంబంధించి, గ్రూప్ 1 పోస్టుల భర్తీ, పంచాయతీ రాజ్ సవరణపై, ఇందిరమ్మ ఇళ్లు, అడ్వకేట్ జనరల్ నియామకం, అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్‌కు సంబంధించి ప్రతిపాదనతో పాటు గవర్నర్ ప్రసంగంపై చర్చించే అవకాశం ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండు హామీలను అమలు చేసిన ప్రభుత్వం, ఆదివారం జరగనున్న భేటీలో మరో రెండు గ్యా రెంటీలకు కేబినెట్ ఆమోదం తెలుపనున్నట్లుగా చెప్పారు. దీంతో పాటుగా ఈ భేటీలో బడ్జెట్ సమావేశాల తేదీలను సైతం మంత్రి మండలి ఖరారు చేయనున్నట్లు తెలిసింది. కేబినెట్ భేటీ తర్వాత బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది. ఈ నెల 8వ తేదీ నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నట్లుగా సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News