Monday, December 23, 2024

రాష్ట్ర ఖజానాకు రూ.48,420 కోట్ల వసూళ్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ రాబడి రాష్ట్ర ఖజా నాకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పన్నుల వసూళ్లలో వాణిజ్యపన్నుల శాఖ గణనీయమైన వృద్ధి రేటును సాధిస్తోంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ, ఎక్సైజ్ శాఖల ఆదాయం కంటే ఎక్కువగా ఈ శాఖ పన్నుల ద్వారా ఆదాయాన్ని రాబడుతోంది. ఈ మూడు శాఖల నుంచి ప్రతి సంవత్సరం లక్ష కోట్ల రూపంలో ఖజానాకు చేరుతోంది. ఈ మూడింటిలో సింహభాగం వాణిజ్య పన్నుల శాఖదే కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ శాఖ నెలకు రూ.6వేల కోట్ల పైచిలుకు పన్నుల వసూళ్లతో దూసుకుపోతోంది.

ఈ ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ.65 వేల కోట్ల ఆదాయం రాబట్టేలా ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఈ నేపథ్యంలోనే వాణిజ్యపన్నుల శాఖ అధికారులు ప్రతినెలా ఠంచన్‌గా పన్నులు వసూళ్లయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో వాణిజ్యపన్నుల శాఖ రాబడిలో గత నవంబర్ కంటే ఈ సారి 16 శాతం వృద్ధిరేటును సాధించగా, డిసెంబర్ నెలాఖరులోపు మరో 2 శాతం వృద్ధిరేటు అధికంగా నమోదు చేసే అవకాశం ఉందని ఆ శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.
గతేడాదికంటే రూ.4 వేల కోట్లు అదనంగా
అమ్మకం పన్నుతో పాటు జీఎస్టీ ఆదాయం పెరగడంతో నవంబర్‌లో వాణిజ్య పన్నుల శాఖ రాబడి రూ.6,252 కోట్లుగా నమోదైంది. గతేడాది నవంబర్ నెలలో రూ.5,345 కోట్ల ఆదాయం రాగా ఈసారి నవంబర్‌లో రూ.907 కోట్ల రాబడి అధికంగా వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి ఎనిమిది నెలలకు వాణిజ్య పన్నులశాఖకు రూ.48,420 కోట్ల రాబడి రాగా గతేడాదికంటే రూ.4,464 కోట్ల ఆదాయం పెరిగింది. ఇది 12 శాతం అదనమని వాణిజ్యపన్నుల శాఖ అధికారులు తెలిపారు. అమ్మకం పన్ను ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.33వేల కోట్లు వస్తుందని అధికారులు అంచనా వేయగా డిసెంబర్ 20వ తేదీ సుమారుగా రూ. 26,220 కోట్ల రాబడి రాగా, జీఎస్టీ ద్వారా రూ. 42,189 కోట్లను అంచనా వేయగా ఎనిమిది నెలల్లో రూ.27,250 కోట్ల ఆదాయం వచ్చింది. పెట్రోలియం అమ్మకం పన్ను ద్వారా రూ.1,165 కోట్లు, మద్యం అమ్మకం పన్నుల ద్వారా రూ. 1,020 కోట్లు, జీఎస్టీ ద్వారా రూ.3,159 కోట్ల రాబడి వచ్చింది.
ఎనిమిది నెలల్లో వాణిజ్య పన్నుల శాఖకు వచ్చిన ఆదాయం ఇలా….
ఎనిమిది నెలల్లో వాణిజ్య పన్నుల శాఖకు వచ్చిన ఆదాయం వివరాలు ఇలా ఉన్నాయి. పెట్రోలు, డీజిల్ అమ్మకం పన్నుల ద్వారా రూ.9,936 కోట్లు, మద్యం అమ్మకం పన్ను ద్వారా రూ.9,804 కోట్లు, వృత్తిపన్ను, ఇతరుల ద్వారా రూ.996 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.10,929 కోట్లు,
ఐజిఎస్టీ ద్వారా రూ.12,946 కోట్లు, ఐజీఎస్టీ సర్ధుబాటు ద్వారా రూ.962 కోట్లు, జీఎస్టీ పరిహారం ద్వారా రూ.2,752 కోట్లు, మొత్తం రూ.48,420 కోట్లను పన్ను వసూళ్ల ద్వారా ఎనిమిది నెలల్లో వాణిజ్యపన్నుల శాఖ ఆర్జించింది.
పెట్రోలియం ఉత్పత్తుల్లో 18 శాతం అధిక రాబడి
పెట్రోలియం ఉత్పత్తులు, మద్యం అమ్మకం పన్నుతో పాటు జీఎస్టీ ఆదాయం 2022,-23 ఆర్థిక సంవత్సరానికి ఈ శాఖ అధిక వృద్ధిరేటును నమోదు చేసింది. రాష్ట్రానికి జీఎస్టీ పరిహారం ఈ ఏడాది నామమాత్రంగా ఉన్నా రాబడి మాత్రం అంచనాల మేరకు ఉంది. పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా గత ఏడాదితో (అక్టోబరు చివరి నాటికి) పోలిస్తే 18 శాతం , మద్యం అమ్మకం పన్నులోనూ 6 శాతం రాబడి పెరిగింది. గత ఏడాది ఇదే సమయానికి రూ. జీఎస్టీ (ఎస్జీఎస్టీ) రాబడి గత ఏడాది కంటే 13 శాతం పెరగడ గమనార్హం. ఈమేరకు ఆదాయపు అంచనాల్లో ఇప్పటికే అధిక వృద్ధిని సాధించింది. ఈ నేపథ్యంలోనే జీఎస్టీ, అమ్మకం పన్నులు కీలకంగా మారాయి. ప్రస్తుత 2022, 23 ఆర్థిక సంవత్సరంలో రూ.65,021 కోట్ల రాబడిని అంచనా వేయగా మొదటి 7 శాతం వృద్ధిరేటును ఆ శాఖ నమోదు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News