Monday, December 23, 2024

రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి దీపా దాస్‌మున్షీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: భారత జాతీయ కాంగ్రెస్ పలు రాష్ట్రాలు, కేం ద్ర పాలిత ప్రాంతాలకు కొత్త ఇన్‌ఛార్జీలను నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌చార్జిగా దీపాదాస్ మున్షీ నియమితులయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో దీపాదాస్ పరిశీలకురాలిగా పనిచేసిన సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్ సీనియర్ నేత ప్రియరంజన్ దాస్ మున్షీ సతీమణే దీపాదాస్ మున్షీ.

ఇప్పటి వరకు తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించిన మాణిక్ రావ్ థాక్రేను గోవా కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా ఎఐసిసి నియమించింది. ఎపి కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా మాణిక్కం ఠాగూర్, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఏఐసీసీ ఇంచార్జ్ పదవి నుంచి కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రాను తప్పించారు. ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా రాజస్థాన్ కు చెందిన కీలక నేత సచిన్ పైలట్‌కు బాధ్యతలు అప్పగించారు. మహారాష్ట్ర ఇంచార్జిగా రమేష్ చెన్నితాల నియమితులయ్యారు. అజయ్ మాకెన్ కోశాధికారిగా, మిలింద్ దేవరాతో పాటు విజయ్ సింగ్లాలు సంయుక్త కోశాధికారులుగా కొనసాగనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News