Monday, December 23, 2024

కెసిఆర్ నేతృత్వంలోనే రాష్ట్రాభివృద్ధి

- Advertisement -
- Advertisement -

దసరా వేడుకల్లో మంత్రి సత్యవతి రాథోడ్

మన తెలంగాణ / హైదరాబాద్ : విజయదశమి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబ సభ్యులతో కలసి ఆయుధ, వాహన పూజలు నిర్వహించారు. తొలుత ఆయుధ పూజ చేసిన మంత్రి వాహన పూజ కూడా చేశారు. ఆయుధపూజలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకులను కూడా ఉంచి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్రం అనతి కాలంలోనే అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలిచిందని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం అనేక అవార్డులు, రివార్డులు, ప్రశంసలు పొందిందని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News