Wednesday, January 22, 2025

సిగ్గు.. సిగ్గు

- Advertisement -
- Advertisement -

వజ్రోత్సవాలకు కాగితపు జెండాలా? కేంద్రం తీరు అవమానకరం
జాతీయ జెండాలను సరఫరా చేయలేని దుస్థితిలో మోడీ ప్రభుత్వం
కోటి 20లక్షల జెండాలను పంపిణీ చేస్తున్న రాష్ట్రం: మంత్రి హరీశ్

మన తెలంగాణ/సిద్దిపేట అర్బన్: స్వతంత్ర భారత స్వర్ణోత్సవ సంబురాల నిర్వహణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరిపై మంత్రి తన్నీర్ హరీశ్ రావు త్రీవస్థాయిలో మండిపడ్డారు. జాతీయ జెండాలను అందించలేకపోతున్నాం, కాగితపు జెండాలతో వజ్రోత్సవ వేడుకలను జరుపుకోవాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీశ్ ఫైర్ అయ్యారు. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు దేశ ప్రజలను అవమానపరిచేలా ఉన్నాయని, ఇది సిగ్గుచేటని నిప్పులు చెరిగారు. ఇదేనా వజ్రోత్సవాలు జరిపే తీరు, జాతీయ జెం డాకు మీరిచ్చే విలువ అంటూ మంత్రి తూర్పారాపట్టారు. ఇంటింటా కాగితపు జెండాలను అంటించమంటారా అని నిలదీశారు. బుధవారం సిద్దిపేట శివారు రంగనాయకసాగర్ వద్ద ఫ్రీడమ్ పార్కును ప్రారంభించారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ వజ్రోత్సవ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. హరిత వనోత్సవం పేరిట రంగనాయక సాగర్ వద్ద ప్రీడమ్ ఫార్కును ప్రారంభించుకోవడం సంతోషకరమైన విషయమన్నారు.

దేశంలో చాలాచోట్ల జాతీయ జెండాలు కేంద్రం సరఫరా చేయలేకపోతున్నాయన్నారు. మేకిన్ తెలంగాణ పేరిట తెలంగాణ ప్రభుత్వం జాతీయ జెండాలను తయారు చేసి ఇంటింటికి ఇస్తున్నట్లు తెలిపారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కోటి 20లక్షల జెండాలు పంపిణీ చేస్తుందన్నారు. జాతిపిత గాంధీ బాటలో ప్రపంచం మొత్తం నిడిచిందంటూ.. గాంధీమార్గంలో స్వాతంత్య్ర ఫలాలు పొంది ఎన్నో విజయాలు సాధించారన్నారు. గాంధీజీని అవమానపరుస్తూ గాడ్చేను పొడిగే సంస్థలను దేశం నుంచి తరమికొట్టాలని, అలాంటి సంస్థల నుంచి దేశాన్ని కాపాడుకోవాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు. అయితే కేంద్ర ప్రభుత్వం అలాంటి సంస్థలపై చర్యలు తీసుకోవడంలేదని.. ఆ దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భావిభారత పౌరుల్లో దేశభక్తిని పెంపొందించేలా స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలను థియేటర్లలో ప్రదర్శించి చూపుతున్నామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News