Monday, December 23, 2024

రాష్ట్ర పాలన హస్తిన నుంచి కొనసాగుతోంది !

- Advertisement -
- Advertisement -

ఒక నెలలో ఆరు సార్లు సిఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ బాట
ఆరు గ్యారెంటీల అమలులో ప్రభుత్వం విఫలం: బిజెపి నేత ఎన్వీఎస్‌ఎస్. ప్రభాకర్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర పాలన మొత్తం డిల్లీ నుంచే కొనసాగుతోందని, ఒక నెలలో సిఎం రేవంత్‌ రెడ్డి ఆరుసార్లు హస్తిన వెళ్లారని బిజెపి నేత ఎన్‌విఎస్‌ఎస్. ప్రభాకర్ ఆరోపించారు.  ఆయన శనివారం తమ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడతూ ప్రస్తుతం రేవంత్ రెడ్డి వ్యవహారం మాజీ సిఎం కెసిఆర్ తరహాలోనే కనిపిస్తోందని, అధికారంలోకి వచ్చాక గత పాలనపై విచారణ చేపడతామని చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులైనా ఎలాంటి విచారణకు ఆదేశించలేదని మండిపడ్డారు. గత సిఎం ఫామ్‌హౌస్ నుంచి పరిపాలన చేస్తే,  రేవంత్ డిల్లీ నుంచి పాలన కొనసాగిస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు.

లక్షల్లో రేషన్ కార్డులను తొలగించాలానే ప్రయత్నాలు ఈ ప్రభుత్వంలో కుట్ర జరుగుతుందని, ఆర్టీసీలో ఉచిత ప్రయాణంలో బస్సులు రాకపోవడం, బస్సులు లేక మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క రేషన్ కార్డ్ తొలిగించినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఉచిత ప్రయాణం హామీకి ప్రభుత్వం దగ్గర స్పష్టమైన ప్రణాళిక లేదన్నారు. రాష్ట్రంలో 850 కి పైన గ్రామాలకు బస్సు సౌకర్యం లేదని, అధికారులు ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. బస్సులు లేక గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, విద్యార్థినీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రేవంత్‌ రెడ్డి సర్కార్ రూ.15 వేల కోట్ల అప్పు కోసం పాకులాడిందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చెపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ బాటలోనే రేవంత్ నడుస్తున్నారని, ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News