Wednesday, January 22, 2025

హామీలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: బిజెపి నేత ఈటెల

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక శ్వేతపత్రం ప్రవేశపెట్టిందంటే మా దగ్గర ఏమీ లేదనే అంశం ఆపార్టీ నాయకులు చెప్పారని బిజెపి సీనియర్ నాయకులు ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. శుక్రవారం ఎల్బీనగర్‌లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పెద్దలు ఎంతో ఆర్భాటంగా హామీలు ఇచ్చారు తప్ప అమలుచేయలేకపోతుందని ఎద్దేవా చేశారు. గత 10 ఏళ్లలో కేంద్రం తెలంగాణలో రూ. 10 లక్షల కోట్లు ఖర్చుపెట్టామని, మూడోసారి ప్రజలు అధికారం కట్టబెట్టాలన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే మోరీలో వేసినట్టేనని, కాంగ్రెస్ కి ఓటు వేస్తే గాడిదలకు గడ్డివేసి ఆవుకు పాలుపిండినట్లు ఉంటుందన్నారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే మోడీ గెలిపించినట్టేనని, త్వరలో జరగబోయే ఎన్నిక డబ్బుకు, ధర్మానికి మధ్య జరుగుతుందన్నారు.

ప్రజలు ధర్మాన్ని కాపాడానికి పిలిస్తే పలికే నాలాంటి నాయకుని ఎన్నుకోవాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ గొప్ప నాయకుడని అందుకే దేశమంతా ఆయనను ప్రేమిస్తున్నారని, పక్కనే సాయిబాబా గుడి దగ్గర జరిగిన రక్తపాతం చూపిస్తే 2014 తరువాత వచ్చిన మోడీ ప్రభుత్వం టెర్రరిజంను అదుపుచేసిందన్నారు. భారత దేశంలో ఒకప్పుడు బంగారం కుదువపెట్టుకొంటే తప్ప జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, ప్రస్తుతం భారత్ బలమైన్ ఆర్థిక శక్తిగా ఎదిగిందని ఇతర దేశాలను స్ఫూర్తిగా తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News