Friday, November 22, 2024

గౌడ కులస్తులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

తొర్రూరు : గౌడ కులస్తులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కౌండిన్య సహకార పరపతి సంఘం నూతన అధ్యక్షులుగా నాగపురి అశోక్‌గౌడ్ అన్నారు. కౌండిన్య సహకార పరపతి సంఘం పదవ వార్షికోత్సవ సమావేశాన్ని డివిజన్ కేంద్రంలోని సాయిరాం జూనియర్ కళాశాలలో నిర్వహించారు. సంఘం అధ్యక్షులుగా పులిముత్తిలింగంగౌడ్ అధ్యక్షతన వార్షిక సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గౌరవ అధ్యక్షులు శామకూరి ఐలయ్యగౌడ్, గోపా డివిజన్ అధ్యక్షులు తాళ్లపల్లి రమేశ్‌గౌడ్‌లు ప్రకటించారు. నూతన అధ్యక్షులుగా నాగపురి అశోక్‌గౌడ్, ప్రధాన కార్యదర్శిగా కుంభం మహేశ్ కుమార్‌గౌడ్, కోశాధికారిగా ఫరీదుల వెంకటేశ్వర్లుగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా అధ్యక్షుడు ఎన్నికైన నాగపురి అశోక్‌గౌడ్ మాట్లాడుతూ గౌడన్నల అభ్యున్నతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

చెట్లకు పన్ను వసూలు చేసే విధానానికి తెలంగాణ ప్రభుత్వం స్వస్తి చెప్పిందని గుర్తు చేశారు. గీత కార్మికులకు సైతం ఆసరా పెన్షన్లు అందుతున్నాయని తెలిపారు. నీరా ఉత్పత్తి, సేకరణ కోసం రూ.ఇరవై కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కెటాయించిందన్నారు. రాబోయే సంవత్సరంలో పరపతి సంఘం సభ్యులకు అన్ని వేళల్లో అందుబాటులో ఉంటూ వారి ఆర్థిక అవసరాలను తీరుస్తూ, గౌడ సమాజాభివృద్ధికి తనవంతుగా సహాయ, సహకారాలు అందజేస్తూ గౌడ కులస్తుల అభ్యున్నతికి తోడ్పడుతామన్నారు. ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపా డివిజన్ అధ్యక్షులు తాళ్లపల్లి రమేశ్‌గౌడ్, గౌడ సహకార పరపతి సంఘం అధ్యక్షులు తాళ్లపెల్లి హేమాద్రిగౌడ్, కౌండిన్య పరపతి సంఘం ప్రధాన కార్యదర్శి గడీల మహేందర్‌గౌడ్, సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ అసోసియేషన్ అధ్యక్షులు కోటగిరి కుమార్‌గౌడ్, న్యాయ సలహాదారులు బండపల్లి వెంకన్నగౌడ్, గౌడ నాయకులు, కౌండిన్య సహకార పరపతి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News