Monday, January 20, 2025

క్రీడలను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం: మంత్రి ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

తొర్రూరు : గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈ నెల 25 నుంచి 27 వరకు రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగే జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టు క్రీడాకారులకు మంత్రి దయాకర్‌రావు క్రీడా దుస్తులను విరాళంగా అందజేసి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టును మంత్రి అభినందించారు. రాష్ట్రంలో షూటింగ్ బాల్ క్రీడను అన్ని ప్రాంతాలకు విస్తరిస్తూ ప్రాచుర్యం కల్పిస్తున్న షూటింగ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, జెడ్పీ ప్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్‌ను మంత్రి దయాకర్‌రావు అభినందించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ గ్రామీణ పట్టణ, ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. షూటింగ్ బాల్ వంటి క్రీడకు రాష్ట్రంలో ఆదరణ పెరిగిందన్నారు. ఈ క్రీడలో రాణిస్తే విద్యయ, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ లభిస్తుందని అన్నారు. క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో షూటింగ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెడుపల్లి ఐలయ్య, ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, షూటింగ్ బాల్ ప్రతినిధులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News