Monday, December 23, 2024

మహిళలకు రాష్ట్ర సర్కారు అన్ని రంగాల్లో ప్రోత్సాహం : వివేకానంద్

- Advertisement -
- Advertisement -

కుత్బుల్లాపూర్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిర్వహించిన తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గాజులరామారంలో ని మహారాజ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎ మ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పథకాలైన కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్, ఆరోగ్య లక్ష్మీ, ఆసరా పింఛన్లు, కెసిఆర్ కిట్, విహబ్ ద్వారా తమకు జరిగిన మేలును లబ్ధిదారులు వివరిస్తూ సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డ పెం డ్లి అంటే బరువు కుంపటి నెత్తిన కుర్చున్నట్టే ఉన్న సందర్భంలో గత ప్రభుత్వాలు ఎన్నడూ చేయని విధంగా సిఎం కెసిఆర్ మేనమామ పాత్రను తలకెత్తుకునున్నారని అన్నారు. దేశంలో ఎక్క డా లేని విధంగా ఆడబిడ్డ పెళ్ళికి లక్ష నూట పదహారు రూపాయలు సలక్షణంగా అందిస్తూ పేదల్లో అలుముకున్న ఆర్థిక ఇక్కట్లను తగ్గిస్తున్నారని చెప్పారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం బాల, బాలికలకు, మహిళలకు పలు స్కీంలు అమలు పరుస్తూ వా రిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందన్నారు. నాణ్యమైన పరికరాలతో కూడిన కెసిఆర్ కిట్, చిన్నారులు, కిశోరబాలికలు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యానికి పాటుపడేలా అంగన్‌వాడీ కేంద్రాలను అందించి పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు.

ఆడ పిల్లలు విద్యారంగంలో ముందుకురావాలి అనే సంకల్పంతో వారి కోసం ప్రత్యేకమైన గురుకులాలను ప్ర భుత్వం స్థాపించిందన్నారు, సాంఘిక సంక్షేమ గిరిజన శాఖ, వెనుకబడిన మైనారిటి సంక్షేమ శాఖల ద్వారా విద్యార్థినుల చదువుల కోసం బృహత్తరమైన కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తున్నదన్నారు. మహిళలకు ఉద్యోగ అవకాశాలు, మహిళలు పారిశ్రమికవేత్తలుగా ఎదగాలనే సంకల్పంతో అంకుర సంస్థలకు ప్రోత్సాహాన్ని కలిగించడం కోసం వీహబ్ ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమం లో డిసిలు మంగతాయారు, ప్రశాంతి, నిజాంపేట్ మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి మరియు మహిళా ప్రజా ప్రతినిధులు, మహిళా అధికారులు, సమైక్య ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, ఆర్పీలు, అంగన్ వాడి టీచర్లు, ఆశా వర్కర్లు, శానిటేషన్ వర్కర్లు, మహిళా ఉద్యోగులు, మహిళా వ్యాపార వేత్తలు, స్టాఫ్ నర్స్ లు, ఏఎన్‌ఎంలు, పోలీస్ మహిళా కానిస్టేబుల్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News