Thursday, January 23, 2025

గిరిజనాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి

- Advertisement -
- Advertisement -

సదాశివనగర్ : ఎన్నో ఏళ్లుగా పంటలు సాగు చేసుకుంటుంన్న పోడు భూములకు పట్టాల కోసం ఎదురు చూసిన గిరిజనులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టాలను అందజేసి వారి జీవితాల్లో వెలుగు నింపారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురెందర్ అన్నారు. సదాశివనగర్ మండలం మర్కల్ గ్రా మ స్టేజీ వద్ద అశోక్ గార్డెన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన పోడు భూములకు పట్టాలు, కళ్యాణ లక్ష్మీ, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్ర మానికి ఎమ్మెల్యే ముఖ్య అథితిగా హాజరైయ్యారు. గిరిజనులతో కలసి సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిశేకం చేశారు.

మండలంలోని 7 గ్రా మ పంచాయతీల పరిధిలోని 475 మంది గిరిజనులకు 1,035 ఎకరాల పోడు భూములకు పట్టాలను పంపిణీ చేశారు. ఉత్తునూర్ 1, వజ్జాపల్లి తాండా 9 , సజ్యానాయక్ తాండా 126, పూర్యా నాయక్ తాండా 107, లక్ష్మీనాయక్ తాండా 120, యాచారం 54, రాంసింగ్ నాయక తాండాలకు చెందిన గిరిజనులకు పోడు భూముల పట్టాలను ఆయన అందజేశారు. అలాగే 17 గ్రామాలకు చెందిన 44 మంది లబ్ధ్దిదారులకు 44 లక్షల 5104 రూపాయల విలువ గల చెక్కులతో పాటు తన స్వంత ఖర్చులతో పట్టు చీరలను అందజేశారు. ఏడుగురు ముఖ్యమంత్రి సహాయనిధి లబ్దిదారులకు 4 లక్షల 26,500 రూపాయల విలువ గల సీఎంఆర్‌ఎఫ్‌చెక్కులను అందజేశారు.

అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వాలు ఏనాడు గిరిజనుల గురించి పట్టించుకోలేదన్నారు. గిరిజనులకు పోడు భూముల పట్టాలు లభించడంతో వారికి ఫారెస్ట్ కష్టాలు తీరినట్లేనని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తరువాత సీఎం కేసీఆర్ సుమారు మూడు వేలకుపైగా తాండాలను గ్రామ పంచాయ తీలుగా మార్చి అభివృద్ధ్ది చేశారని చెప్పారు. జీపీలుగా మారిన తరువాత తాండాల లో పూర్తి మౌలిక సదుపాయాలను కల్పిస్తూ గిరిజనుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. బిజేపి, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మాదిరి అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయాలని సవాలు విసిరా రు. టిపిసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత కాకుండా కేవలం మూడు గంటలు ఇస్తే సరిపోతుందనడం సిగ్గుచేటని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దేశంలో నెంబర్ వన్ నిలుస్తుందని తెలిపారు. సమావే శంలో ఎంపిపి గైని అనసూయ రమేష్, జెడ్పిటిసీ కమ్లి నర్సింలు, జడ్పి కోఆప్షన్ సభ్యుడు మోయినొద్దిన్, స్థానిక సర్పంచ్ జూకంటి సంగారెడ్డి, ఎంపిటిసీ భైరవరెడ్డి, బిఆర్‌ఎస్ ఏఎంసీ చైర్మన్ పుల్గం సాయిరెడ్డి, రైతు బంధు అధక్షుడు భూంరెడ్డి, బిఆరెఎస్ పార్టీ రాష్ట్ర గిరిజన నాయకుడు శ్రీనివాస్ నాయక్, మండల అద్యక్షుడు మహెందర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News