Thursday, January 23, 2025

మహిళా సాధికారిత దిశగా రాష్ట్రం ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి:మహిళా సాధికారత దిశ గా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని, మ హిళా సంక్షేమ కోసం అనేక కార్యక్రమాలను అమ లు చేస్తుందని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అ న్నారు. మంగళవారం పెద్దపల్లిలోని ఆర్‌ఆర్ గార్డెన్ లో దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన మ హిళా సంక్షేమ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మలు, బోనాలతో వారికి ఘన స్వాగతం పలికా రు. మహిళలు ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను ఎమ్మె ల్యే, అదనపు కలెక్టర్ పరిశీలించి, పిల్లలకు అక్షరాభ్యాసం చేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహి ంచారు. పలువురు కౌన్సిలర్లు గర్భిణీ మహిళలక సీ మంతం చేశారు.

అనంతరం ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ 9ఏళ్ల పాలనలో సీఎం కేసీఆర్ సాధించిన విజయాలను ఈ రోజు మననం చే సుకోవడం ఆనందంగా ఉందన్నారు. మహిళల సం క్షేమానికి చేస్తున్న కృషి దేశంలోని ఏ రాష్ట్రంలో ఇం తగా చేయడం లేదన్నారు. కడుపులో బిడ్డ నుంచి పండు ముసలి వరకు సంక్షేమ పథకాల అమలు చే స్తున్నారని అన్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలకు పౌ ష్టికాహారం, మహిళలకు ప్రత్యేకంగా బస్తీ దవాఖానా లు, ఉద్యోగ నియామకాల్లో 33 శాతం, రాజకీయా ల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. ప్రభు త్వ ఆసుపత్రులను అద్భుతంగా తయారు చేసుకున్నామని, పెద్దపల్లిలో వంద పడకల మాతా, శిశు ఆ సుపత్రి ఆధునిక వసతులతో నిర్మించుకున్నామని తెలిపారు. ఆడపిల్ల పెళ్లిఖర్చు, కేసీఆర్ న్యూట్రిషన్ కి ట్ అందజేస్తున్నామని అన్నారు. దేశంలోనే అంగన్‌వాడీ కార్యకర్తలకు అత్యధిక జీతాలు అందిస్తున్నది మన రాష్ట్రమేనని తెలిపారు. వృద్దులకు, వితంతువులకు ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు ఆసరా పించన్లు రూ.2016 ఇస్తున్నామని అన్నారు. వృద్ధుల సంరక్షణ బాధ్యతను మనమందరం తీసుకోవాలని, ప్రభుత్వం అందించే సహకారంతోపాటు ప్ర జలు వారి ఇంట్లో ఉన్న వృద్ధులను ప్రేమతో కాపాడుకోవాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ కోరా రు.అనంతరం 91స్వశక్తి మహిళా సంఘాలకు రూ. 7.75 కోట్ల రుణం చెక్కులను పంపిణీ చేశారు.

విధి నిర్వహణలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన మహిళ అధికారులకు,ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అం దించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రం థాలయ చైర్మన్ రఘువీర్ సింగ్, మున్సిపల్ చైర్మెన్ దాసరి మమత, ఆయా శాఖల జిల్లా అధికారులు రౌ ఫ్‌ఖాన్, తిరుపతిరావు, నరసింహచారి, రంగారెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News